పొదలకూరులో రోడ్డు ప్రమాదం

NLR: పందిని ఢీకొని బైకు మీద వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పొదలకూరు మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని ఆర్.వై. పాలెం వద్ద పందిని ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతనిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు కలువాయి మండలంలోని తెలుగురాయపురం గ్రామానికి చెందిన వ్యక్తిగాగా గుర్తించారు.