రామన్నపాలెంలో 12అడుగుల కొండచిలువ హల్‌చల్

రామన్నపాలెంలో 12అడుగుల కొండచిలువ హల్‌చల్

AKP: అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో ధర్మిరెడ్డి శ్రీరాములు ఇంటి వద్ద శుక్రవారం రాత్రి కొండచిలువ హల్‌చల్ చేసింది. పంట పొలాలు నుంచి వచ్చి శ్రీరాములు ఇంటి మెట్లు వద్ద పాము ఉండడంతో పిల్లల ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు వేశారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు కొండచిలువను హతమార్చారు. ఇది దాదాపు 12 అడుగుల పొడవు ఉంటుందని స్థానికులు తెలిపారు.