'కుప్పంలో వినూత్న కార్యక్రమానికి సీఎం శ్రీకారం'

చిత్తూరు: పుట్టుక నుంచి మరణించే వరకు ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేసి సమాచారాన్ని భద్రపరిచినట్లు పేర్కొన్నారు.