పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లమ్మ

పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లమ్మ

VZM: విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి శ్రీ పైడితల్లమ్మ ఆలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా వనం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేకువజాము నుండి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.