దళిత నియోజకవర్గంలో దొరల పెత్తనం ఏంటి: వెంకటయ్య
WGL: వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యగా కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య విమర్శించారు. శుక్రవారం పట్టణంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీగా వెలమ వర్గానికి చెందిన దయాకర్ రావును నియమించడం కులవాదానికి నిదర్శనమని ఆరోపించారు.