'పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన'

VKB: బురాన్ పల్లి గ్రామంలో రూ.1.46 కోట్ల అభివృద్ధి పనులను తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.63 లక్షలతో PWD నుండి బురాన్ పల్లి వరకు, మరో రూ.63 లక్షలతో ధన్నారం వరకు నూతన BT రోడ్లను ప్రారంభించారు. గత పదేళ్లలో అభివృద్ధి నిర్లక్ష్యం అయిందని స్పీకర్ అన్నారు.