పెదనందిపాడులో రోడ్డు ప్రమాదం
GNTR: పెదనందిపాడు (M) ఏబిపాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకుమాను (M) పెద్దపాలెం గ్రామానికి చెందిన ప్రకాశ్, అతని భార్య విశ్రాంతి పెదపాలెం నుంచి ప్రత్తిపాడు వెళ్తూ దారిలో ఏబిపాలెంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు అవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.