చట్టాలపై కార్మికులు అవగాహన కలిగి ఉండాలి

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పులి వెంకట్ రెడ్డి పార్కులో జూనియర్ సివిల్ జడ్జి బి రూప శ్రీ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ వేతన సవరణ చట్టం, హక్కులు, బాధ్యతలపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఇందులో కార్మిక శాఖ అధికారి సుబ్బరాయుడు, వచ్చింద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.