తిరుమలలో ప్రొద్దుటూరు వాసులకు తప్పిన ప్రమాదం
TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న భక్తులు 14వ మలుపు వద్ద కారు టైర్ పంక్చర్ కావడం వల్ల అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు, కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులు, క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువరాల్సి ఉంది.