రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
HNK: హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం తనిఖీల్లో కీలక రికార్డులు పరిశీలిస్తున్నారు. ఫోన్‌పే ద్వారా డాక్యుమెంట్ రైటర్లు మామూళ్లు చెల్లించినట్లు, పై అధికారులకు కూడా వాటాలు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ రైటర్ 90 లక్షల విల్లా కొనుగోలు చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టారు.