VIDEO: దర్గా ఉర్సు ముగింపు వేళ హుండీల లెక్కలపై సందేహాలు..!
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. ఉత్సవాల అనంతరం హుండీల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే దర్గా నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. హుండీలు మాయం అవుతున్నాయన్నాయి. ఈసారి హుండీల లెక్కింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి వివరాలు వెల్లడించాలని భక్తులు కోరుతున్నారు.