VIDEO: వీరభద్రాలయంలో రాహుకాల పూజలు

VIDEO: వీరభద్రాలయంలో రాహుకాల పూజలు

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకుడు శంకరయ్య స్వామి మహిళా భక్తులకు రాహుకాల పూజల ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం అర్చనలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమణారెడ్డి తెలిపారు.