ఎక్లాస్పూర్ హైస్కూల్లో అదనపు తరగతి గది ప్రారంభం
KNR: ఎక్లాస్పూర్ హై స్కూల్లో దాతల సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదిని ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్ ప్రారంభించారు. సుశీల- పద్మనాభ రెడ్డి స్మారకార్థం వారి కుమారులు గదిని నిర్మించి పాఠశాలకు అందజేశారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని సుధాకర్ అన్నారు. ఎంఈవో రవీంద్ర చారి, పాక్స్ పీఐసీ కొత్త తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.