దీపావళి ఎఫెక్ట్: పర్యాటక ప్రాంతాలు వెలవెల
VSP: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రజల దృష్టి అంతా బాణసంచా విక్రయాలు, కొనుగోళ్లపైనే కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతో విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి. ముఖ్యంగా సాగర తీరాలు కళతప్పాయి. పండుగ హడావుడిలో జనం ఇళ్లకే పరిమితం కావడంతో, సాధారణంగా సందడిగా ఉండే బీచ్‌లు నిర్మానుష్యంగా మారాయి.