గుంటూరు జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి
GNTR: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి జైలు నుంచి విడులయ్యాడు. వెల్దుర్తి(M) గుండ్లపాడులో గతేదాడి మే నెలలో జరిగిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైలులో ఉండగా.. ఈ నెల 18న రామకృష్ణారెడ్డి విడుదల కాగా, వెంకట్రామిరెడ్డి ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యాడు.