'అర్జీలను తక్షణమే పరిష్కరించాలి'

'అర్జీలను తక్షణమే పరిష్కరించాలి'

VSP: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించి వారికి సమాచారం అందజేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమిలి ఎండీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు సూచించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని హెచ్చరించారు.