ట్రాఫిక్‌ చలానాలపై 50 శాతం డిస్కౌంట్‌

ట్రాఫిక్‌ చలానాలపై 50 శాతం డిస్కౌంట్‌

బెంగళూరు ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు శుభవార్త చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు విధించిన జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. రాయితీపై నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తుందని పోలీసులు తెలిపారు. డిస్కౌంట్ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలో 2.51 లక్షల చలాన్ల ద్వారా రూ.7.19 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ రాయితీ వచ్చే నెల 19 వరకు కొనసాగుతుందని తెలిపారు.