రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

NDL: బనగానపల్లె మండలం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర ప్రసాద్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. బనగానపల్లె మండలం పెద్దరాజుపాలెం గ్రామానికి చెందిన అతను సిమెంట్ లోడ్ వేసుకొని బెంగళూరుకి వెళ్తుండగా వెనకనుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.