అర్బన్ మార్కెట్‌ను సందర్శించిన ఛైర్‌పర్సన్
NLR: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి, డీసీవో గుర్రప్ప మార్కెట్‌ను ప్రారంభించారు. ఇందులో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలించి, పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాన్ని వ్యాపారంలో పెట్టి ఆర్థికంగా రాణించాలని వారు ఆకాంక్షించారు.