టీడీపిలో చేరిన బీసీ నేత రేలంగి నాగేశ్వరరావు

బీసీ నేత రేలంగి నాగేశ్వరరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేలంగి 2019 ఎన్నికల్లో అనపర్తిలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.