రాయచోటిలో డిగ్రీ పరీక్షలు పరిశీలన

అన్నమయ్య: రాయచోటిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పరిసర ప్రాంతాల డిగ్రీ కళాశాలలను వైవీఎస్ యూనివర్శిటీ హై పవర్ స్క్వాడ్ సభ్యుడు ఈశ్వర్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. డిగ్రీ రెండవ, నాల్గవ, ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణను ఆయన సమీక్షించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ, పరీక్షా నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించారు.