రోడ్డు ప్రమాదంలో.. మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో.. మహిళ దుర్మరణం

NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ ఘాట్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. చుండి గ్రామానికి చెందిన ఇరుపని దత్తమని తన భర్తతో కలిసి కాలినడకన మాలకొండకు దైవ దర్శనానికి వెళుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దత్తమనిని 108 అంబులెన్స్‌లో కందుకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది