రోడ్డు ప్రమాదం.. ఎంఈవో కుటుంబ సభ్యులకు గాయాలు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎస్ఎం.పేట హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గంపలగూడెం ఎంఈవో-2 నరసింహారావు కుటుంబం శ్రీశైలం వెళ్లి కారులో తిరిగి వస్తున్న సమయంలో అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎంఈవో కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.