జిల్లాలో తొలి 'కుసుమ్' సోలార్ ప్లాంట్ ప్రారంభం

జిల్లాలో తొలి 'కుసుమ్' సోలార్ ప్లాంట్ ప్రారంభం

KMM: తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ (PM-KUSUM) పథకం కింద ఏర్పాటు చేసిన 2 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించారు. రైతు బీరవల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రారంభమైన తొలి సోలార్ ప్లాంట్ ఇదే అని అధికారుల వెల్లడించారు.