VIDEO: బేస్తవారిపేటలో ప్రజా దర్బార్
ప్రకాశం: బేస్తవారిపేటలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలను ఆయనకు వివరించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.