17వ డివిజన్‌లో పర్యటించిన కమిషనర్
నెల్లూరు సిటీ 17వ డివిజన్ గుండ్లపాలెంలో నూతనంగా లేఅవుట్ వేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ వైఓ.నందన్ మంగళవారం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. అనుమతి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అనుమతించిన ప్లాన్ మేరకే నిర్మాణాలు కొనసాగాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.