పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు అనుమానాస్పద మృతి

పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు అనుమానాస్పద మృతి

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ళగడ్డలో వృద్ధురాలు పాపమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సైదాచారి ఈరోజు మృతి చెందాడు. ఏలూరులో పోలీసులు ఇతనిని అదుపులోకి తీసుకుని, సూర్యాపేటకు తరలిస్తుండగా కోదాడ వద్ద అస్వస్థతకు గురై మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే అతడి మృతిపై పలు అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.