VIDEO: ‘విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు’
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ఇవాళ ఛైర్‌పర్సన్ బండారి అనూష ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్, వాటర్ సెక్షన్ కార్మికుల హాజరు పట్టికలను నిశితంగా పరిశీలించారు. నెలకు రూ.78 లక్షల వేతనాలు చెల్లిస్తున్నా, కొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర కీలకమన్నారు.