VIDEO: దివ్యాంగురాలి సమస్యపై కలెక్టర్ స్పందన
WGL: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాయపర్తి మండలానికి చెందిన దివ్యాంగురాలు ప్రతి కంట లక్ష్మి తన సమస్యను వివరించారు. గ్రామ శివారులో సర్వే నంబర్ 1522లోని 10 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా తన పేరుమీద నమోదు చేయాలని కలెక్టర్ డా. సత్య శారదను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్,15 రోజులలో సమస్య పరిష్కరించాలని RDO ఆదేశించారు.