MLA అనిరుధ్ రెడ్డి ఎమోషనల్
TG: జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆయన స్వగ్రామం రంగారెడ్డిగూడలో BJP విజయం సాధించింది. తన ఊరు కోసం రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేశానని.. అయినా అందరూ కలిసి నమ్మించి మోసం చేశారని అన్నారు. బయటి నుంచి వేరే పార్టీ నాయకులు వచ్చి.. తన అభ్యర్థి ఓటమికి కుట్రలు చేశారని ఆరోపించారు.