'పర్యాటక హబ్‌గా మార్చడమే లక్ష్యం'

'పర్యాటక హబ్‌గా మార్చడమే లక్ష్యం'

PPM: తోటపల్లి ఐటీడీఏ పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయని కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి ఆదివారం తెలిపారు. ఐటీడీఏ పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన స్పీడ్ బోట్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా బోటులో ప్రయాణించి భద్రత ప్రమాణాలను పరిశీలించారు. తోటపల్లి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పర్యాటక హబ్‌గా మార్చడమే లక్ష్యం అన్నారు.