VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇల్లందకు చెందిన ద్విచక్ర వాహనదారుడు మైదం సిద్ధు, ఆటోలో ఉన్న గుగులోతు సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్ధానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.