వివాహిత అదృశ్యం

వివాహిత అదృశ్యం

MDK: శివంపేట మండలం చండీ గ్రామంలో వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చండి గ్రామానికి చెందిన సంధిగాని కళ్యాణికి దరిపల్లికి చెందిన బాబుతో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా ఏడాది నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆదివారం ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని, కుటంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.