అంబులెన్స్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

NZB: జక్రాన్ పల్లి మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అంబులెన్స్‌లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ఔషధాల సరఫరా, ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు, సిబ్బంది విధి నిర్వహణ తీరును పరిశీలించారు.