మంత్రి లోకేష్‌తో ఎమ్మెల్యే కళా భేటీ
VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సోమవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాలను, సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మరిన్ని అభివృద్ధి పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం జిల్లా రాజకీయ పరిస్థితులను చర్చించినట్లు తెలిపారు.