తిరుచానూరులో పుష్కర్ ఘాట్ నిర్మాణం
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద పుష్కర్ ఘాట్ నిర్మించబోతోంది అని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా చిగురువాడ, వేదాంతపురం, తిరుచానూరు నదీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి ఆక్రమణలను గుర్తిస్తామని, కట్టడాలు ఉన్నవారికి నోటీసులు ఇచ్చి 60 రోజుల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.