'విద్యాభివృద్ధికి కంకణం కట్టుకున్న ప్రధాని'

'విద్యాభివృద్ధికి కంకణం కట్టుకున్న ప్రధాని'

SKLM: విద్యాభివృద్ధికి ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వర రావు అన్నారు. కొండములగాం మోడల్ స్కూల్‌లో ఆయన మంగళవారం మాట్లాడారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఈ పాఠశాల ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. దేశంలో కొన్ని పాఠశాలల్లో మన పాఠశాల ఒకటిగా నిలవడం టీచర్ల కృషికి, విద్యార్థుల ప్రతిభకి, తల్లిదండ్రుల విశ్వాసానికి గౌరవ సూచకమని అన్నారు.