మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నిరసన
NLR: మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదలకు వైద్యం ఎలా అందుతుందని మాజీ డీసీసీబీ ఛైర్మన్, వైసీపీ నాయకులు వీరూ చలపతి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కొడవలూరు మండలం తలమంచిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామస్థులు సంతకాలు చేశారు.