పుష్కర ఏర్పాట్లు ప్రణాళిక పరిశీలన

పుష్కర ఏర్పాట్లు ప్రణాళిక పరిశీలన

MNCL: లక్షెట్టిపేట పట్టణ శివారులోని గోదావరి నది తీరంలో నిర్వహించే పుష్కరాల ఏర్పాట్ల ప్రణాళికను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. గురువారం తహసీల్దార్ దిలీప్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్‌లతో కలిసి ఆయన గోదావరి తీరానికి చేరుకున్నారు. పుష్కరాల కోసం చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.