పోలీస్ శాఖలోనే ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం

TG: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును నకిలీ ధ్రువపత్రాలతో మోసం చేసిన 59 మంది అభ్యర్థులపై పోలీస్ శాఖ చర్యలకు సిద్ధమైంది. నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలడంతో వారిని విధుల నుంచి తొలగించనున్నారు. ఈ అభ్యర్థులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. పోలీస్ శాఖలోనే ఇలాంటి బాగోతం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది.