VIDEO: దేవరకొండలో ఆశా వర్కర్ల నిరసన

VIDEO: దేవరకొండలో ఆశా వర్కర్ల నిరసన

NLG: దేవరకొండలో బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఆశా వర్కర్లు CITU ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.