25న కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా

KRNL: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఈనెల 25న కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనుంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. గురుశేఖర్ మాట్లాడుతూ.. రజకులపై దాడులు, అక్రమ కేసుల నివారణకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.