నిలిచిపోయిన మెడికల్ కళాశాలను పరిశీలించిన మంత్రి

సత్యసాయి: పెనుకొండ పట్టణంలో నిలిచిపోయిన మెడికల్ కాలేజీని గురువారం కూటమి నాయకులతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2021లో జగన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పినా.. ఆయన పదవీ కాలం పూర్తయినా ఒక్క కాలేజీ కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని విమర్శించారు.