యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
KKD: ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపు, పాత పెన్షన్ విధానం (OPS) సాధన కోసం UTF రాష్ట్ర పిలుపుమేరకు పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష రణభేరి కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.