VIDEO: కోడుగల్ బ్రిడ్జిపై రేడియం స్టిక్కర్లు
MBNR: వాహనదారుల భద్రత దృష్ట్యా కోడుగల్ బ్రిడ్జిపై ఆదివారం రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో మలుపులు, బ్రిడ్జి అంచులు స్పష్టంగా కనిపించేలా వీటిని అతికించినట్లు సర్పంచ్ సాయిరెడ్డి తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం ఈ చర్యలు చేపట్టామని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.