వెంకటాపురంలో 10 బోరు బావుల కేబుల్ వైర్ చోరీ

వెంకటాపురంలో 10 బోరు బావుల కేబుల్ వైర్ చోరీ

సత్యసాయి: చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీ వెంకటాపురం గ్రామంలో 10 బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించబడిన ఘటన సోమవారం బయటపడింది. మూడు నెలలుగా ఇలాంటి చోరీలు కొనసాగుతున్నాయని రైతులు రామకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి తదితరులు పేర్కొన్నారు. దుండగులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.