ఉత్తమ సేవలు కనపరిచిన అప్పికొండ నూకరాజుకు సత్కారం

కాకినాడ: ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం సార్వత్రిక ఎన్నికల్లో బందోబస్తులో ఉత్తమ సేవలు కనబరిచిన రౌతులపూడి పోలీస్ స్టేషన్ సంబంధించిన అప్పికొండ నూకరాజును జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సత్కరించి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి ఎస్సై అబ్దుల్ నబీ నూకరాజుకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయి తినిపించారు.