'నీరు కలుషితం కాకుండా చూడాలి'

HYD: ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ మిషన్ అధికారులతో ఎండీ అశోక్ రెడ్డి ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున మంచినీరు కలుషితం కాకుండా జాగ్రత్తపడాలని, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం అన్ని సెక్షన్లలో మంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు.