రోజురోజుకు తీవ్రమవుతున్న కోతుల బెడదా

రోజురోజుకు  తీవ్రమవుతున్న కోతుల బెడదా

KNR: శంకరపట్నం మండలంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమైంది. దారి వెంట నడుచుకుంటూ వెళ్లే ప్రజలపై కోతులు దాడి చేసి గాయపరుస్తున్నాయి. మొలంగూర్, మక్త, కేశవపట్నం గ్రామాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల్లో బీభత్సం సృష్టించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.