మోపిదేవి క్షేత్రానికి మిర్యాలగూడ భక్తుని విరాళం

మోపిదేవి క్షేత్రానికి మిర్యాలగూడ భక్తుని విరాళం

కృష్ణా: మోపిదేవిలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానం పథకమునకు  మిర్యాలగూడ వాస్తవ్యులు వుజ్జిని శ్రీనివాస రావు, సౌజన్య దంపతులు రూ. 1,00,001లు విరాళం అందచేశారు. శుక్రవారం దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ బి.వై.కిషోర్ కు తమ విరాళం అందించారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.